రైతుల్ని వేధించొద్దు: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం వేధించడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, అమరావతి రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని ఆయన హితవు పలికారు. సామాజిక దూరం పాటిస్తూ అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని ఆయన వారికి మద్దతు పలికారు. పాత […]
ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం వేధించడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, అమరావతి రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని ఆయన హితవు పలికారు. సామాజిక దూరం పాటిస్తూ అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని ఆయన వారికి మద్దతు పలికారు. పాత కేసులపై విచారణ పేరిట వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం తగదని అన్నారు. భూమి ఇచ్చిన రైతులు, భూమి లేని పేదల పట్ల ప్రభుత్వం సానుభూతి చూపాలని ఆయన సూచించారు.
tags: janasena, pawan kalyan, amaravathi, twitter