‘జానాకు సాగర్ లో పోటీ చేయడం ఇష్టం లేదు’

దిశ, నల్లగొండ: నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి పోటీ చేయడమే ఇష్టం లేదని, అధిష్టానమే బలవంతంగా బరిలో నిలిపిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్నామనే సంతోషమే వారికి లేదని, కేవలం అధికారం పోయిందనే ఆతృతే ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని, వారేమో కులాల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇది కాగ్రెస్ […]

Update: 2021-04-15 00:50 GMT

దిశ, నల్లగొండ: నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి పోటీ చేయడమే ఇష్టం లేదని, అధిష్టానమే బలవంతంగా బరిలో నిలిపిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

నల్లగొండలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్నామనే సంతోషమే వారికి లేదని, కేవలం అధికారం పోయిందనే ఆతృతే ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని, వారేమో కులాల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇది కాగ్రెస్ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవికోసం జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి హనుమంతురావు, శబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క వంటి నాయకులు కొట్లాడుతున్నారని, వారి కల్లబొల్లి మాటలు సాగర్ ప్రజలు నమ్మొద్దని చెప్పారు. సాగర్ ప్రజలు విజ్ఞత తో ఉన్నారని, తెలంగాణలో జానాకు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు.

కాంగ్రెస్ సో కాల్డ్ లీడర్లు ఎప్పుడూ తెలంగాణ కోసం కొట్లాడలేదని, వారంత కేసీఆర్ పార్టీని విలీనం చేస్తామన్నా వ్యతిరేకించారని ఆరోపించారు. నోముల నర్సింహయ్య అసెంబ్లీలో కొట్లాడి సాగర్ ను అభివృద్ధి చేశారని అన్నారు. జానారెడ్డికి ఇద్దరు కుమారులతో తల నొప్పిగా మారిందని, ఆయన పేరును బద్‌నాం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి టీడీపీని ముంచి కాంగ్రెస్ లో చేరారని, భజన బ్యాచ్ ను వెంట తెచ్చుకుని సాగర్ లో డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు సాగర్ ప్రజలు నమ్మవద్దని, శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న తనపై విమర్శలు సంధించడం సరికాదన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని చెప్పారు.

Tags:    

Similar News