అండర్సన్ వరల్డ్ రికార్డు.. టెస్టుల్లో 600 వికెట్లు
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ పేస్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 600 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. అంతేగాకుండా టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ రికార్డు సృష్టించాడు. 600 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు. మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, తర్వాత అండర్సన్ ఈ జాబితాలో చేశారు. కాగా ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ అంతర్జాతీయ ఏ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ పేస్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 600 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. అంతేగాకుండా టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ రికార్డు సృష్టించాడు. 600 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు.
మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, తర్వాత అండర్సన్ ఈ జాబితాలో చేశారు. కాగా ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ అంతర్జాతీయ ఏ ఫాస్ట్ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డును అండర్సన్ సాధించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన మరో ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ (519), అండర్సన్ వెనకాలే ఉండటం విశేషం. కాగా సౌంతాప్టన్లో గులాబీ బంతితో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అండర్సన్ ఈ ఘనత సాధించాడు.