టెస్టు క్రికెట్‌లో అండర్సన్ రికార్డు

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టులో కీలక బౌలర్, సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకపై 6 వికెట్లతో చెలరేగిపోయాడు. అండర్సన్ ధాటికి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక 381 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిరోషన్ డిక్వెల్లా (92), సురంగ లక్మల్ (0), ఏంజెలో మాథ్యూస్ (110), కుశాల్ పెరీరా (6), లాహిరు తిరిమన్నే (43) లను పెవీలియన్ […]

Update: 2021-01-23 10:04 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టులో కీలక బౌలర్, సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకపై 6 వికెట్లతో చెలరేగిపోయాడు. అండర్సన్ ధాటికి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక 381 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిరోషన్ డిక్వెల్లా (92), సురంగ లక్మల్ (0), ఏంజెలో మాథ్యూస్ (110), కుశాల్ పెరీరా (6), లాహిరు తిరిమన్నే (43) లను పెవీలియన్ చేర్చి అండర్సన్ ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం అండర్సన్‌కు ఇది 30వ సారి. దీంతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (29) రికార్డును అధిగమించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో అందరి కంటే ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ (67) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షేన్ వార్న్ (37), రిచర్డ్ హాడ్లీ (36), అనిల్ కుంబ్లే (35), రంగన హెరాత్ (34) ఉన్నారు. ఇక ఆసియాలో జేమ్స్ అండర్‌సన్ ఐదు వికెట్లు తీయడం ఇది రెండో సారి. అంతకు ముందు 2012లో శ్రీలంకపైనే ఆ ఘనత సాధించాడు.

Tags:    

Similar News