చెరువులా మారిన రహదారి.. జల్‌పల్లికి దారేది..?
దిశ, జల్‌పల్లి: పట్ణణ ప్రగతిలో భాగంగా ప్రతినెల మున్సిపాలిటీకి రూ. 48 లక్షల నిధులు మంజూరు అవుతున్నా.. జల్‌పల్లికి వెళ్లే ప్రధాన రహదారికి మాత్రం మోక్షం కలుగడం లేదు. హైదరాబాద్ లక్ష్మిగూడ నుంచి జల్‌పల్లికి వెళ్లాలన్నా.. షాహిన్‌నగర్ నుంచి జల్‌పల్లిలోకి రావాలన్నా.. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చినుకుపడితే జల్‌పల్లి మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు చిత్తడి అవుతున్నాయి. ఇక భారీ వర్షానికి మాత్రం పరిస్థితి మరింత అద్వానంగా మారుతున్నది. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ఆ రహదారి గుండా […]
దిశ, జల్‌పల్లి: పట్ణణ ప్రగతిలో భాగంగా ప్రతినెల మున్సిపాలిటీకి రూ. 48 లక్షల నిధులు మంజూరు అవుతున్నా.. జల్‌పల్లికి వెళ్లే ప్రధాన రహదారికి మాత్రం మోక్షం కలుగడం లేదు. హైదరాబాద్ లక్ష్మిగూడ నుంచి జల్‌పల్లికి వెళ్లాలన్నా.. షాహిన్‌నగర్ నుంచి జల్‌పల్లిలోకి రావాలన్నా.. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
చినుకుపడితే జల్‌పల్లి మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు చిత్తడి అవుతున్నాయి. ఇక భారీ వర్షానికి మాత్రం పరిస్థితి మరింత అద్వానంగా మారుతున్నది. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ఆ రహదారి గుండా వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో అదుపుతప్పి నీటిలో పడిపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం గుంతలు తేలిన రహదారుల్లో అయినా మరమ్మత్తులు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని.. కనీసం ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.