తర్వాత ఈటలే సీఎం.. జోస్యం చెప్పిన శ్రీనివాస్ గౌడ్

దిశ ,కమలాపూర్: కేసీఆర్‌పై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడనే ఈటల రాజేందర్‌ను కేసీఆర్ కుట్రపన్ని బయటకు పంపించాడన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలు కావని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, దొరల అహంకార పాలనకు […]

Update: 2021-10-24 04:38 GMT
తర్వాత ఈటలే సీఎం.. జోస్యం చెప్పిన శ్రీనివాస్ గౌడ్
  • whatsapp icon

దిశ ,కమలాపూర్: కేసీఆర్‌పై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడనే ఈటల రాజేందర్‌ను కేసీఆర్ కుట్రపన్ని బయటకు పంపించాడన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలు కావని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, దొరల అహంకార పాలనకు మధ్య జరిగే ఎన్నికగా భావిస్తున్నామన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అవుతారని, కమలాపూర్ బిడ్డ ఈటల రాజేందర్ తర్వాత ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News