లాక్ డౌన్ అతిక్రమిస్తే 'మసక్కలి 2.0' వినిపిస్తాం

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలిసిందే. నిబంధనలు అతిక్రమించి బయట కాలు పెడితే లాఠీకి పనిచెప్తున్నారు పోలీసులు. అదంతా కూడా మన క్షేమం గురించే అనుకోండి. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు మాత్రం లాక్ డౌన్ విషయంలో తమ ఆర్డర్‌ను అతిక్రమిస్తే… వెరైటీ పనిష్మెంట్ ఇస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదిక వెల్లడించారు పోలీసులు. ఇంట్లో ఉంటారా… బయటకు వచ్చి మసక్కలి […]

Update: 2020-04-11 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలిసిందే. నిబంధనలు అతిక్రమించి బయట కాలు పెడితే లాఠీకి పనిచెప్తున్నారు పోలీసులు. అదంతా కూడా మన క్షేమం గురించే అనుకోండి. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు మాత్రం లాక్ డౌన్ విషయంలో తమ ఆర్డర్‌ను అతిక్రమిస్తే… వెరైటీ పనిష్మెంట్ ఇస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదిక వెల్లడించారు పోలీసులు. ఇంట్లో ఉంటారా… బయటకు వచ్చి మసక్కలి 2.0 సాంగ్ వినే శిక్షను అనుభవిస్తారా? మీ ఇష్టం అంటూ యువకులను ఇంటికి పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా బయట తిరిగితే గదిలో బంధించి మసక్కలి 2.0 పాట ప్లే చేస్తామని భయపెడుతున్నారు.

మసక్కలి 2.0 సాంగ్ ఈ మధ్యే రిలీజ్ అయి భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఢిల్లీ 6 సినిమాలోని మసక్కలి పాటను రీమిక్స్ చేయడంపై ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా మండిపడ్డారు. ఎంతో మంది రాత్రింబవళ్లు శ్రమించి పని చేసి అంత మంచి మెలొడి సాంగ్‌ను అందిస్తే… దానిని రీమిక్స్ చేసి చెడగొట్టారని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.

Tags: Masakali 2.0, Lock Down, CoronaVirus, Covid19, Jaipur Police

Tags:    

Similar News