చీటింగ్ కేసులో భార్యాభర్తలకు జైలు శిక్ష

దిశ, కరీంనగర్ సిటీ : ఇల్లు అమ్ముతామంటూ రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిన కేసులో భార్యాభర్తలకు జైలు శిక్ష పడిన సంఘటన కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నగరంలోని మారుతీ నగర్‌కు చెందిన భార్యాభర్తలు శ్రీరాముల కిరణ్ మై, వెంకటేశ్వర్లు 2013లో నగరానికి చెందిన సంపత్ రెడ్డి అనే వ్యక్తికి రూ.40 లక్షలకు విక్రయించేందుకు ఇంటిని అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలు బయానాగా తీసుకున్నారు. ఒప్పందం మేరకు అదే ఏడాది సెప్టెంబర్ 18న […]

Update: 2021-03-30 11:50 GMT

దిశ, కరీంనగర్ సిటీ : ఇల్లు అమ్ముతామంటూ రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిన కేసులో భార్యాభర్తలకు జైలు శిక్ష పడిన సంఘటన కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నగరంలోని మారుతీ నగర్‌కు చెందిన భార్యాభర్తలు శ్రీరాముల కిరణ్ మై, వెంకటేశ్వర్లు 2013లో నగరానికి చెందిన సంపత్ రెడ్డి అనే వ్యక్తికి రూ.40 లక్షలకు విక్రయించేందుకు ఇంటిని అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలు బయానాగా తీసుకున్నారు. ఒప్పందం మేరకు అదే ఏడాది సెప్టెంబర్ 18న మిగతా రూ.30 లక్షలు చెల్లించిన అనంతరం కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా వాయిదాలు వేస్తున్నారు.

దీంతో 2014 జూన్ 6న సంపత్ రెడ్డి తగిన ఆధారాలతో స్థానిక త్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. ఈ కేసును పిడిఎం కోర్టుకు అప్పగించగా.. వాదోపవాదాలు జరిగిన అనంతరం భార్యాభర్తలిద్దరిని నిందితులుగా రుజువు చేస్తూ.. పిడిఎం న్యాయస్థానం రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Tags:    

Similar News