జాన్వీ అంటే నేనొక్కదాన్నే కాదు..
దిశ, వెబ్‌డెస్క్: జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ల గారాల పట్టి. ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. గుంజన్ సక్సేనా, రూహి అఫ్జానా లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ.. మరిన్ని బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలను లైన్లో పెట్టింది. https://www.instagram.com/tv/CAH4LhZA8PH/?utm_source=ig_web_copy_link అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడగా.. ప్రస్తుతం తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో లాక్ డౌన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా […]
దిశ, వెబ్‌డెస్క్: జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ల గారాల పట్టి. ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. గుంజన్ సక్సేనా, రూహి అఫ్జానా లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ.. మరిన్ని బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలను లైన్లో పెట్టింది.
https://www.instagram.com/tv/CAH4LhZA8PH/?utm_source=ig_web_copy_link
అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడగా.. ప్రస్తుతం తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో లాక్ డౌన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ టైంలో తను చాలా విషయాల్లో రియలైజ్ అయిందట. ‘జాన్వీ అంటే నేనొక్కదాన్నే కాదు.. జాన్వీ అంటే అమ్మ నేను.. నాన్న నేను.. చెల్లి నేను అని చెప్పింది. నేను ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తాను అన్న జాన్వీ… లాక్ డౌన్ డేస్‌లో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను’ అని చెప్పింది. షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో నాన్న నన్ను చాలా మిస్ అవుతున్నారన్న విషయం గ్రహించానని చెప్తోంది. అంతేకాదు ఈ సమయం నన్ను చాలా పాజిటివ్‌గా మార్చేసిందన్న జాన్వీ.. ఇలాంటి జీవితం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. కాగా ‘క్వారంటైంట్ టేప్స్ విత్ జాన్వీ కపూర్’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. తండ్రితో గేమ్స్ ఆడుకోవడం, చెల్లిని ఆటపట్టించడం, డ్యాన్స్ ప్రాక్టీస్‌తో పాటు లైఫ్‌లో తన మెమోరబుల్ పిక్స్ షేర్ చేసింది. ‘లాక్ డౌన్లో బయటకు వెళ్ళకపోతే ఏంటి.. మీతో మీరు జీవించండి.. మిమ్మల్ని మీరు కనుగొనండి’ అని చెప్తోంది.