సైబర్ నేరాలపై ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు : ఎస్పీ సింధు శర్మ

దిశ, జగిత్యాల : నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) ఆన్లైన్ మరియు టోల్ ఫ్రీ నంబర్ 155260 ద్వారా సైబర్ నేరాలపై బాధితులు ఏ పోలీస్ స్టేషన్లలోనైనా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కంప్లెంట్ ఇచ్చిన మరుక్షణం మనీ ట్రాన్స్ఫర్‌ను అడ్డుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ సింధుశర్మ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సైబర్ నేరాలపై పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Update: 2021-06-26 07:57 GMT

దిశ, జగిత్యాల : నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) ఆన్లైన్ మరియు టోల్ ఫ్రీ నంబర్ 155260 ద్వారా సైబర్ నేరాలపై బాధితులు ఏ పోలీస్ స్టేషన్లలోనైనా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కంప్లెంట్ ఇచ్చిన మరుక్షణం మనీ ట్రాన్స్ఫర్‌ను అడ్డుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ సింధుశర్మ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సైబర్ నేరాలపై పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో సైబర్ క్రైమ్‌కు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ) ఆన్లైన్, టోల్ ఫ్రీ నెంబర్ 155260 ద్వారా సైబర్ నేరాలపై ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, హెచ్‌ఓ‌రైటర్లు, టెక్ టీం, రిసెప్షన్, ప్రొబేషనరీ ఎస్‌ఐలకు , హైదరాబాద్ ఐటీ సెల్ నిపుణుల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం జిల్లాలో నమోదైన సైబర్ నేరాలపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు వెంకటరమణ, గౌస్ బాబా, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Tags:    

Similar News