ఐదు డిమాండ్లతో సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

దిశ, మెదక్: లాక్‌డౌన్ పరిస్థితుల దృష్ట్యా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు ఐదు డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. తన డిమాండ్లతో ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారని, కాబట్టి ప్రస్తుతం హౌస్‌టాక్స్ కట్టే పరిస్థితి లేదని, ఈ ఏడాది టాక్స్ మాఫీ చేయాలని జగ్గారెడ్డి కోరారు. అలాగే, అద్దె ఇండ్లలో ఉంటున్న వారు కూడా రెంట్ కట్టే పరిస్థితిలో లేరని వారికి కూడా 6 నెలలపాటు ప్రభుత్వమే […]

Update: 2020-06-03 07:42 GMT

దిశ, మెదక్: లాక్‌డౌన్ పరిస్థితుల దృష్ట్యా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు ఐదు డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. తన డిమాండ్లతో ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారని, కాబట్టి ప్రస్తుతం హౌస్‌టాక్స్ కట్టే పరిస్థితి లేదని, ఈ ఏడాది టాక్స్ మాఫీ చేయాలని జగ్గారెడ్డి కోరారు. అలాగే, అద్దె ఇండ్లలో ఉంటున్న వారు కూడా రెంట్ కట్టే పరిస్థితిలో లేరని వారికి కూడా 6 నెలలపాటు ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక నల్లా బిల్లులు కూడా ఏడాదిపాటు రద్దు చేయాలని లేఖలో జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు కూడా రాయితీ ఇవ్వాలన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అలాగే, ఈ నెల 8 లోపు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 9న తాను దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఎంపీలతో కేంద్రం మీద ఒత్తిడి పెంచాలన్నారు.

Tags:    

Similar News