Y. S. Jaganmohan Reddy: ‘యాస్’పై..అమిత్‌షాతో జగన్ వీడియో కాన్షరెన్స్..
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా కొనసాగుతున్న యాస్ 24గంటల్లో అతితీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో యాస్ తుఫాన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏపీకి ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు, రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలనికి అమిత్‌షాను సీఎం కోరారు. అంతేకాకుండా ఆసుప్రతులకు కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ సిబ్బందిని […]
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా కొనసాగుతున్న యాస్ 24గంటల్లో అతితీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో యాస్ తుఫాన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏపీకి ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు, రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలనికి అమిత్‌షాను సీఎం కోరారు.
అంతేకాకుండా ఆసుప్రతులకు కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ సిబ్బందిని కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. తుఫాన్ వల్ల కొవిడ్ రోగులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలని అధికారులకు సూచనలు చేశారు.