విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి సీఎం జగన్ లేఖ
దిశ, ఏపీ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందని, సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా 20 శాతానికిపైగా పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని, ఇది ప్రభుత్వానికి […]
దిశ, ఏపీ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందని, సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా 20 శాతానికిపైగా పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని, ఇది ప్రభుత్వానికి చాలా భారమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
బొగ్గు కొరత విద్యుత్ ప్లాంట్లను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 185-190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని లేఖలో వివరించారు. అయితే కొవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం దాటిందని పేర్కొన్నారు. బొగ్గు కొరత దేశంలోని విద్యుత్ ప్లాంట్లను సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదముందని సీఎం జగన్ లేఖలో ప్రస్తావించారు. ఏపీ జెన్ కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేర మాత్రమే తీర్చగలుగుతోందని సీఎం జగన్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 1-2 రోజుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్టు సీఎం జగన్ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని వివరించారు. వాస్తవానికి రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు.
బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు
కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని కేవలం.. 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. మరోవైపు 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ఉన్న ఒప్పందాలను రాష్ట్రప్రభుత్వం వినియోగించుకోలేని పరిస్థితిలో ఉందని వెల్లడించారు. దేశంలో బొగ్గు కొరత కారణంగా బహిరంగ మార్కెట్‌లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ టైమ్ విద్యుత్ కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం యూనిట్ ధర రూ.20కి పెరిగిందని..అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ధరకు కూడా విద్యుత్ అందుబాటులో ఉండటం లేని లేఖలో ప్రధానికి వివరించారు. ఈ పరిణామాలు డిస్కమ్‌ల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముందని సీఎం జగన్ లేఖలో ప్రస్తావించారు. దీంతో విద్యుత్ సంక్షోభంపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖలో విజ్ఞప్తి చేశారు.
అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయండి
‘రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండటం లేదు. ఏపీ థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని కోరుతున్నాం. కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నాం. విద్యుత్ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలి. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని’ సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు.