నాలుగు లక్షల గౌనులో తళుక్కుమన్న తమన్నా

దిశ, సినిమా: సౌత్‌ ఇండస్ట్రీలో కొంతకాలం టాప్ స్టార్‌గా కొనసాగిన తమన్నాకు ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మేరకు కథాబలమున్న సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌కు ఓకే చెప్తున్న మిల్క్ బ్యూటీ.. ‘మాస్టర్ చెఫ్’ తెలుగు కుకింగ్ షోకు హోస్ట్‌గానూ చేస్తోంది. కాగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో ‘మర్చేసా’ బ్రాండ్‌కు చెందిన బ్లాక్ గౌను ధరించింది. ఈ అవుట్‌ఫిట్స్‌లో గార్జియస్‌గా కనిపించిన తమన్నా.. కుకింగ్ షోకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. కాగా FarFetch.com‌లో ఈ గౌను ధర నాలుగు […]

Update: 2021-08-29 02:35 GMT

దిశ, సినిమా: సౌత్‌ ఇండస్ట్రీలో కొంతకాలం టాప్ స్టార్‌గా కొనసాగిన తమన్నాకు ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మేరకు కథాబలమున్న సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌కు ఓకే చెప్తున్న మిల్క్ బ్యూటీ.. ‘మాస్టర్ చెఫ్’ తెలుగు కుకింగ్ షోకు హోస్ట్‌గానూ చేస్తోంది. కాగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో ‘మర్చేసా’ బ్రాండ్‌కు చెందిన బ్లాక్ గౌను ధరించింది. ఈ అవుట్‌ఫిట్స్‌లో గార్జియస్‌గా కనిపించిన తమన్నా.. కుకింగ్ షోకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. కాగా FarFetch.com‌లో ఈ గౌను ధర నాలుగు లక్షలకు పైనే ఉండటం గమనార్హం.

ఇంత డబ్బుతో ‘మారుతి ఆల్టో లేదంటే డట్సన్ గో’ కారును ఈజీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే హై ఎండ్ ఉమెన్స్ వేర్‌లో ఈ అమెరికన్ బ్రాండ్ ‘మర్చేసా’కు మంచి పేరుంది. అందుకే ధరలు కూడా అదే రేంజ్‌లో ఉన్నట్టున్నాయి. ఇక షో విషయానికొస్తే ‘ఇంటర్నేషనల్ మాస్టర్ చెఫ్’ వెర్షన్‌కు పెద్ద ఫ్యాన్ అయినన తమన్నా.. తెలుగులో హోస్ట్ చేసే అవకాశం తనకు దక్కడం పట్ల కల నిజమైందని పేర్కొంది. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘మాస్టర్ చెఫ్’లో హైదరాబాద్‌కు చెందిన సెలబ్రిటీ చెఫ్స్ సంజయ్ తుమ్మ, చలపతి రావు, మహేశ్ పడాల ఉన్నారు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma