20% క్షీణించిన ఐటీసీ లాభాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,232.40 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 4,023.10 కోట్లతో పోలిస్తే ఈసారి 19.65 శాతం క్షీణించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాలా ఆదాయం 0.1 శాతం పెరిగి రూ. 11,976.75 కోట్లకు చేరుకుంది. సిగరెట్ వ్యాపారా ద్వారా వచ్చే ఆదాయం రూ. 5,326.83 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,232.40 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 4,023.10 కోట్లతో పోలిస్తే ఈసారి 19.65 శాతం క్షీణించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాలా ఆదాయం 0.1 శాతం పెరిగి రూ. 11,976.75 కోట్లకు చేరుకుంది.
సిగరెట్ వ్యాపారా ద్వారా వచ్చే ఆదాయం రూ. 5,326.83 కోట్ల నుంచి 5,121.30 కోట్లకు పడిపోయింది. సంస్థకు చెందిన ఇతర వ్యాపారాల నుంచి కార్యకలాపాల ఆదాయం రూ. 3,794.95 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. హోటల్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం కొవిడ్-19 కారణంగా రూ. 426.63 కోట్ల నుంచి రూ. 81.96 కోట్లకు పడిపోయింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఐటీసీ సంస్థ షేర్ల ధర 0.49 శాతం క్షీణించి రూ. 173.95 వద్ద ముగిసింది.