జొమాటోతో జత కట్టిన ఐటీసీ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ లిమిటెడ్ కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులకు సులభమైన డెలివరీ అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజ కంపెనీ జొమాటోతో భాగస్వామ్యం కానున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలో ‘కాంటాక్ట్‌లెస్ డెలివరీ’లను అందించనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇదివరకే మరో ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీతో ఐటీసీ హోటల్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తాజాగా జొమాటోతో కలిసి కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున తమ వినియోగదారులకు సురక్షితమైన […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ లిమిటెడ్ కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులకు సులభమైన డెలివరీ అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజ కంపెనీ జొమాటోతో భాగస్వామ్యం కానున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలో ‘కాంటాక్ట్‌లెస్ డెలివరీ’లను అందించనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇదివరకే మరో ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీతో ఐటీసీ హోటల్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తాజాగా జొమాటోతో కలిసి కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున తమ వినియోగదారులకు సురక్షితమైన సేవలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది.
జొమాటోతో భాగస్వామ్యం గురించి ఐటీసీ హోటల్స్ అధికారి అనీల్ మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి నివారణ, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాంటాక్ట్‌లెస్ డెలివరీ సదుపాయాన్ని తీసుకొచ్చామని, దీంతో కస్టమర్లు ఇంటివద్ద నుంచే ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేయవచ్చనీ పేర్కొన్నారు. అలాగే, ఐటిసి హోటల్స్, తమ అతిథులకు దేశవ్యాప్తంగా హోమ్ డెలివరీ సేవల కోసం తగిన నిర్ణయాన్ని తీసుకుంటుందని పేర్కొన్నారు. జోమాటోతో సహకారం ద్వారా డెలివరీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు మరింత సహాయపడుతుందన్నారు.