కరోనాపై ఐటీసీ పోరు..
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఐటీసీ తనవంతుగా కృషి చేస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని 18 గ్రామాలతోపాటు భద్రాచలం ప్రాంతంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం సంస్థ ప్రాంగణంలో సామాజిక దూరం పాటిస్తూనే చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ప్రతిరోజు 18 గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నట్టు ఆ సంస్థ […]
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఐటీసీ తనవంతుగా కృషి చేస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని 18 గ్రామాలతోపాటు భద్రాచలం ప్రాంతంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం సంస్థ ప్రాంగణంలో సామాజిక దూరం పాటిస్తూనే చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ప్రతిరోజు 18 గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు. 500 మంది వలస ఆదివాసీలకు, పనులు చేసే సిబ్బందికి, డ్రైవర్లకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
tags :ITC, major, contributor, control, coronavirus, khammam, tribes