విజయ్ ఇంట్లో సీజ్ జరగలేదు
తమిళనాడులో ఐటీ రైడ్స్ చర్చనీయాంశం అయింది. హీరో విజయ్‌ను బుధవారం షూటింగ్ స్పాట్‌లోనే ఐదు గంటల పాటు విచారించిన అధికారులు రెండోరోజు సోదాలు కొనసాగించారు. మెర్సల్ మూవీకి సంబంధించిన ఏజీఎస్ సంస్థ నిర్మాత, ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్, హీరో విజయ్ ఇంట్లో రైడ్స్ నిర్వహించారు. మొత్తం 38 ప్రాంతాల్లో సోదాలు జరగాయి. ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నివాసం, చెన్నై, మధురై కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.77కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్‌నోట్ రిలీజ్ […]
తమిళనాడులో ఐటీ రైడ్స్ చర్చనీయాంశం అయింది. హీరో విజయ్‌ను బుధవారం షూటింగ్ స్పాట్‌లోనే ఐదు గంటల పాటు విచారించిన అధికారులు రెండోరోజు సోదాలు కొనసాగించారు. మెర్సల్ మూవీకి సంబంధించిన ఏజీఎస్ సంస్థ నిర్మాత, ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్, హీరో విజయ్ ఇంట్లో రైడ్స్ నిర్వహించారు. మొత్తం 38 ప్రాంతాల్లో సోదాలు జరగాయి. ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నివాసం, చెన్నై, మధురై కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.77కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు అధికారులు. బంగారంతోపాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
హీరో విజయ్ ఇంట్లో ఎలాంటి సీజ్ జరగలేదని వెల్లడించారు. సినిమాలో నటించినందుకు నిర్మాత నుంచి ఎంత తీసుకున్నాడు? ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు? అన్న కోణంలో విచారణ జరిగిందని, ఆయన నుంచి ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదని తెలిపారు.