ఈ నెల 20న పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు.. కసరత్తు మొదలుపెట్టిన కేంద్రం..?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని దానిపై క్రమంగా సస్పెన్స్ వీడుతున్నది. ఈనెల 20వ తేదీన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని దానిపై క్రమంగా సస్పెన్స్ వీడుతున్నది. ఈనెల 20వ తేదీన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు మహిళా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఐదురోజుల స్పెషల్ సెషన్ సందర్భంగా మహిళా బిల్లును 20వ తేదీన ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సమావేశాల్లో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సెషన్స్ ప్రారంభం సందర్భంగా చెప్పారు. ఈ నిర్ణయాల్లో మహిళా బిల్లు కూడా ఉంటుందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తున్నది. ఈ క్రమంలో 20వ తేదీన సభ ముందుకు ఈ బిల్లురాబోతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ బిల్లు విషయంలో కేంద్రం కసరత్తు చేస్తుందన్న సమాచారం ఆసక్తిగా మారింది.