రైళ్ల పునరుద్ధరణ తేదీని ఇప్పుడే చెప్పలేం: వీకే యాదవ్

న్యూఢిల్లీ: సాధారణ రైల్వే సేవల పునరుద్ధరణపై కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో జనరల్ మేనేజర్లు చర్చలు జరిపారని, వారి నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత తిరిగి సేవలను ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్యాసింజర్ రైలు సేవల ద్వారా రూ.4,600కోట్ల ఆదాయం వచ్చిందని, 2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపు(2021, మార్చి) వరకు రూ.15,000 ఆదాయం సాధించడం లక్ష్యమని తెలిపారు. ఇదే విభాగంలో […]

Update: 2020-12-18 07:44 GMT

న్యూఢిల్లీ: సాధారణ రైల్వే సేవల పునరుద్ధరణపై కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో జనరల్ మేనేజర్లు చర్చలు జరిపారని, వారి నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత తిరిగి సేవలను ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్యాసింజర్ రైలు సేవల ద్వారా రూ.4,600కోట్ల ఆదాయం వచ్చిందని, 2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపు(2021, మార్చి) వరకు రూ.15,000 ఆదాయం సాధించడం లక్ష్యమని తెలిపారు.

ఇదే విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.53,000కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ప్యాసింజర్ సేవల విభాగంలో గత ఏడాదితో పోలిస్తే 87శాతం ఆదాయం కోల్పోయమని వీకే యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ప్రస్తుతం నడుస్తున్న రైళ్లల్లో ప్రయాణికులు సగటున 30 నుంచి 40శాతం మాత్రమే ఎక్కుతున్నారని, ఇది ప్రజల్లో ఉన్న కరోనా మహమ్మారి భయాందోళనలను స్పష్టం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1089 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని చెప్పారు.

Tags:    

Similar News