వాట్సాప్ సురక్షితమేనా?
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ వచ్చాక మెసేజింగ్ అనేది చాలా సులభతరం అయిపోయింది. ప్రతీ చిన్న విషయాన్ని మెసేజ్ ద్వారా పంపించడానికి వాట్సాప్ ఉపయోగపడుతోంది. రెండు బిలియన్ల యూజర్లున్న వాట్సాప్‌లో ఒకరోజులో కోట్ల కొద్ది మెసేజ్‌లు బదిలీ అవుతాయి. కాబట్టి సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది కాబట్టి అది అత్యంత సురక్షితంగా ఉందని అందరూ అనుకున్నారు. ఆ నమ్మకంతోనే రహస్యంగా మాట్లాడుకోవాల్సినవి కూడా వాట్సాప్‌లో మెసేజ్‌లు […]
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ వచ్చాక మెసేజింగ్ అనేది చాలా సులభతరం అయిపోయింది. ప్రతీ చిన్న విషయాన్ని మెసేజ్ ద్వారా పంపించడానికి వాట్సాప్ ఉపయోగపడుతోంది. రెండు బిలియన్ల యూజర్లున్న వాట్సాప్‌లో ఒకరోజులో కోట్ల కొద్ది మెసేజ్‌లు బదిలీ అవుతాయి. కాబట్టి సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది కాబట్టి అది అత్యంత సురక్షితంగా ఉందని అందరూ అనుకున్నారు. ఆ నమ్మకంతోనే రహస్యంగా మాట్లాడుకోవాల్సినవి కూడా వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. గ్రూప్‌లు క్రియేట్ చేసుకుని అందులో డీలింగ్స్ చేసుకుంటున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు వాట్సాప్ సెక్యూరిటీని శంకించేందుకు దారులు చూపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి రోజుకొక వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ బయటకు లీకవుతోంది.
సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారడంతో బాలీవుడ్ తారలు ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేసుకున్న సీక్రెట్ చాట్‌ల స్క్రీన్ షాట్లు లీకయ్యాయి. ఇలాంటి చాట్‌లు బయటికొస్తే ఇబ్బంది కలుగుతుందని తెలియనంత వెర్రివాళ్లు కాదు. అయినప్పటికీ వాళ్ల వాట్సాప్ చాట్‌లు, ప్రైవేట్ మెసేజ్‌లు బయటకు రావడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో భాగంగా మాట్లాడుకుంటున్న ఇద్దరికీ, బృందానికీ తప్ప మిగతా వాళ్లకు ఈ మెసేజ్‌లు కనిపించకూడదు. అయినప్పటికీ ఇలా ప్రైవేట్ చాట్‌లు బయటికి రావడం గురించి వాట్సాప్‌ను అడిగితే ఇలా స్పందించారు. ‘వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. పంపినవారికి, అందుకున్నవారికి మాత్రమే ఆ మెసేజ్ చదివే వీలుంటుంది. కేవలం ఫోన్ నెంబర్ ద్వారా మాత్రమే వాట్సాప్‌కు సైన్ అప్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి కనీసం వాట్సాప్ సంస్థ కూడా మీరు పంపుకున్న మెసేజ్‌లను చూడలేదు’.
వాట్సాప్ తమ సెక్యూరిటీ గురించి పూర్తి కచ్చితత్వంతో ఉంది. మరి వాట్సాప్ చాట్‌లు ఎలా లీకవుతున్నాయి? దీనికి కూడా వాట్సాప్ ప్రతినిధి ఒక వివరణ ఇచ్చుకున్నారు. ఇలా చాట్‌లు లీక్ అవడానికి కారణం మెసేజ్‌లు బ్యాకప్ చేయడం. వాట్సాప్ చాట్‌లు, డాక్యుమెంట్‌లు, ఇంకా ఇతర మీడియా ఫైల్‌లు బ్యాకప్ అవుతాయి. ఆండ్రాయిడ్ ఉపయోగిస్తుంటే గూగుల్ డ్రైవ్‌లో, ఆపిల్ ఉపయోగిస్తే ఐక్లౌడ్‌లో బ్యాకప్ అవుతాయి. ఒక్కసారి మెసేజ్‌లు బ్యాకప్ అయ్యాక వాట్సాప్‌కు సంబంధం ఉండదు. ఆ మెసేజ్‌ల సెక్యూరిటీ బాధ్యతను ఆ డ్రైవ్‌లో చూసుకోవాలి. డ్రైవ్‌లో పెట్టుకోవడానికి చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ, యూజర్‌లు వాటిని ఉపయోగించుకోరు. అందుకే డ్రైవ్ నుంచి ఇలా బ్యాకప్ అయిన మెసేజ్‌లను ఎవరైనా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అలా బ్యాకప్ నుండి యాక్సెస్ చేసిన మెసేజ్‌లే ఇప్పుడు బయటపడ్డాయని వాట్సాప్ ప్రతినిధి చెబుతున్నారు.
ఈ రకంగా చూస్తే వాట్సాప్ సురక్షితమే కానీ వాట్సాప్ మెసేజ్‌లను బ్యాకప్ చేసిన తర్వాత అవి సురక్షితం కాదని తేలింది. అందుకే వీలైనంత మేరకు వాట్సాప్‌లో ఇబ్బందికర విషయాలు మాట్లాడుకోకపోవడమే మంచిదని, ఒకవేళ మాట్లాడినా వాటిని వెంటనే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ద్వారా మెసేజ్‌లు తొలగించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే బ్యాకప్ చేసినపుడు కూడా డ్రైవ్‌లు అందించే సెక్యూరిటీ ఫీచర్లను ఉపయోగించుకోవాలని, పాస్‌వర్డులు బలంగా ఉండేలా చూసుకోవాలని, పాస్‌వర్డులను ఎవరితో పంచుకోవద్దని కూడా చెబుతున్నారు.