హుజురాబాద్ రిజల్ట్ ఎఫెక్ట్.. 50వేల ఉద్యోగాలు లేనట్టేనా.?
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ప్రాణత్యాగాలు చేసినా ఫలితం లేకుండా పోతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులే ఉన్నాయని మండి పడుతున్నారు. ఎన్నికలొచ్చిన సమయంలో అదిగో ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్లు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ధ్యేయంగా నిరుద్యోగులు సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్షంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ […]
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ప్రాణత్యాగాలు చేసినా ఫలితం లేకుండా పోతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులే ఉన్నాయని మండి పడుతున్నారు. ఎన్నికలొచ్చిన సమయంలో అదిగో ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్లు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ధ్యేయంగా నిరుద్యోగులు సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్షంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వివిధ కార్యక్రమాలు చేశారు.
కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. గతంలో నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ‘త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ’ అని ప్రచారం ఉపయోగించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నోటిఫికేషన్‌ను మాత్రం రిలీజ్ చేయలేదని చెబుతున్నారు. అయితే, జోనల్ సిస్టమ్‌తో పాటు డిపార్ట్‌మెంట్ల వారీగా ఉద్యోగ ఖాళీలను గుర్తించగా.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది. ఈక్రమంలో ఉప ఎన్నికలో వేల సంఖ్యలో నామినేషన్లు వేసి నిరసన తెలిపేందుకు నిరుద్యోగులు ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల కొందరు మాత్రమే బరిలో నిలిచారు.
అయితే, అధికార పార్టీ నోటిఫికేషన్లపై మరోసారి త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రచారంలోకి దిగింది. అయితే, ప్రతీ ఎన్నికలోనూ ఇదే మాట చెప్పి రిజల్ట్ రాగానే మరిచిపోతున్నారని ఓటర్లు భావించడంతో.. టీఆర్ఎస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. టీఆర్ఎస్ ఓటమితో ఉద్యోగ నోటిఫికేషన్లు మరికొంత ఆలస్యం అవుతాయంటూ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఓటమి భయంతోనైనా నోటిఫికేషన్లు వేస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికైనా నోటిఫికేషన్లు రిలీజ్ చేయండి. హుజురాబాద్ ఫలితంతో సంబంధం లేకుండా ఏళ్లుగా ఎదురుచూస్తున్నఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి. ఓటమితో 50 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం అవుతాయన్న వార్తలు నిజం కాదని తేల్చండి@KTRTRS @TelanganaCMO @trsharish
— Telangana Unemployed Youth (@TUYOfficialPage) November 2, 2021