యాక్షన్ కామె‘ఢీ’కి సీక్వెల్ రెడీ

దిశ, వె‌బ్‌డెస్క్: మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం ఓ బ్లాక్ బాస్టర్ హిట్‌. దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఈ చిత్రం తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని, స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. అయితే ‘ఢీ’ చిత్రం విడుదలై, ఇప్పటికే 13 సంవత్సరాలు దాటిపోగా, ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ విషయంపై కొన్నేళ్లుగా చర్చలు జరుగుతుండగా, తాజాగా దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ […]

Update: 2020-11-20 02:59 GMT

దిశ, వె‌బ్‌డెస్క్: మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం ఓ బ్లాక్ బాస్టర్ హిట్‌. దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఈ చిత్రం తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని, స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. అయితే ‘ఢీ’ చిత్రం విడుదలై, ఇప్పటికే 13 సంవత్సరాలు దాటిపోగా, ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ విషయంపై కొన్నేళ్లుగా చర్చలు జరుగుతుండగా, తాజాగా దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను స్వయంగా హీరో మంచు విష్ణునే అందించడం విశేషం.

విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘ఢీ’ మూవీ కామెడీ యాక్షన్ డ్రామాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అయితే దర్శకుడు శ్రీనువైట్లతో పాటు హీరో మంచు విష్ణుకు కూడా కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేవు. దీంతో వీరిద్దరూ తమ కెరీర్‌ను మరోసారి గా‘ఢీ’లో పెట్టుకునేందుకు చేతులు కలిపారు. నవంబర్ 23న విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఢీ సీక్వెల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నారు.

‘మూవీ లవర్స్ ఫేవరెట్ చిత్రాల్లో ‘ఢీ’ మూవీ ఒక‌టి. ఈ చిత్రం మా మూవీ యూనిట్‌కు గేమ్ చేంజ‌ర్‌గా నిలిచింది. ఆ స‌మ‌యంలో ఎన్నో చిత్రాల‌కు న్యూ వేవ్‌గా కూడా నిలిచింది. ‘ఢీ’ కంటే బెటర్ ఏది?’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేయడంతో పాటు 13 ఏప్రిల్ 2007లో ఢీ విడుదలైంది, నవంబర్ 23, 2020లో ఏం అప్‌డేట్ రానుంది? అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను జత చేశాడు. దీంతో మంచు విష్ణు అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరో పెద్ద హిట్ కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

https://twitter.com/iVishnuManchu/status/1329639416835448833?s=20

Tags:    

Similar News

టైగర్స్ @ 42..