థియేటర్లలో ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం

దిశ, వెబ్‌డెస్క్: లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. దీంతో తన చివరి చిత్రం ‘ది సాంగ్ ఆఫ్ స్కార్పియోన్స్‌’ థియేటర్లలో రిలీజ్ చేసి ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్ధమయ్యారు. తద్వారా ఇండియన్ సినిమా మోస్ట్ ఫేవరెట్ యాక్టర్‌కు నివాళి ఇవ్వబోతున్నామని.. 2021 ఫస్ట్ హాఫ్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు మేకర్స్. అనూప్ సింగ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను పనోరమ, 70ఎంఎం బ్యానర్స్ సమర్పిస్తుండగా.. ఫెదర్ లైట్, కేఎన్ఎమ్ […]

Update: 2020-12-28 07:12 GMT
థియేటర్లలో ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. దీంతో తన చివరి చిత్రం ‘ది సాంగ్ ఆఫ్ స్కార్పియోన్స్‌’ థియేటర్లలో రిలీజ్ చేసి ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్ధమయ్యారు. తద్వారా ఇండియన్ సినిమా మోస్ట్ ఫేవరెట్ యాక్టర్‌కు నివాళి ఇవ్వబోతున్నామని.. 2021 ఫస్ట్ హాఫ్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు మేకర్స్. అనూప్ సింగ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను పనోరమ, 70ఎంఎం బ్యానర్స్ సమర్పిస్తుండగా.. ఫెదర్ లైట్, కేఎన్ఎమ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఒక స్వతంత్ర యువ గిరిజన మహిళ చుట్టూ తిరిగే కథలో క్రూరమైన ద్రోహాన్ని అధిగమించేందుకు తన గొంతును ఎలా వినిపించిందనేదే సినిమా. కాగా ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఒంటెల వ్యాపారి పాత్రలో కనిపించగా.. ప్రముఖ నటుడు వహీదా రెహ్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ‘ది సాంగ్ ఆఫ్ ది స్కార్పియన్స్’ స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడినట్లు తెలిపారు మేకర్స్.

Tags:    

Similar News