ఐఆర్‌సీటీసీ కార్యకలాపాల ఆదాయంలో క్షీణత
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (kovid-19) వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రభావానికి గురైన ఐఆర్‌సీటీసీ (IRCTC) 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో రూ. 4.60 కోట్ల నికర నష్టాల (Net losses)ను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో రైలు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ప్రభుత్వం కొన్ని రైళ్లను నడిపేందుకు అనుమతించింది. దీంతో సంస్థ సంపాదన ప్రభావితమైందని ఐఆర్‌సీటీసీ (IRCTC) పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం 71.40 క్షీణించి రూ. 131.33 కోట్లకు చేరుకుంది. […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (kovid-19) వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రభావానికి గురైన ఐఆర్‌సీటీసీ (IRCTC) 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో రూ. 4.60 కోట్ల నికర నష్టాల (Net losses)ను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో రైలు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ప్రభుత్వం కొన్ని రైళ్లను నడిపేందుకు అనుమతించింది. దీంతో సంస్థ సంపాదన ప్రభావితమైందని ఐఆర్‌సీటీసీ (IRCTC) పేర్కొంది.
సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం 71.40 క్షీణించి రూ. 131.33 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 459.23 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో సంస్థ వ్యాపారంలోని అన్ని విభాగాలు ప్రభావితమయ్యాయి. పర్యాటక విభాగం (Department of Tourism) అత్యధికంగా ప్రభావితమై ఆదాయం గతేడాది నమోదైన రూ. 47.62 కోట్ల నుంచి ఈసారి రూ. 2.95 కోట్లకు పడిపోయిందని రెగ్యులేటరీ ఫైలింగ్ (Regulatory Filing)లో పేర్కొంది. కేటరింగ్ విభాగం ద్వారా వచ్చే ఆదాయం రూ. 89.89 కోట్లకు, ఇంటర్నెట్ టికెట్ ఆదాయం రూ. 32.22 కోట్లకు, రైల్ నీర్ ఆదాయం రూ. 3.5 కోట్లకు తగ్గాయని సంస్థ వెల్లడించింది.