IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ల ‘ఇంపాక్ట్’ ఎంత?
టాటా ఐపీఎల్ 2023లో ఈ సారి కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రవేశపెట్టారు.
దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో ఈ సారి కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రవేశపెట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే 12వ ప్లేయర్ అని అర్థం అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను మ్యాచ్ కు ముందుగానీ, లేక మ్యాచ్ జరుగుతున్న సమయంలో గానీ సంబంధిత టీమ్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు 9 టీమ్ లు ఇంపాక్ట్ ప్లేయర్స్ ను వాడుకున్నాయి. అయితే అందులో ఏ ప్లేయర్ క్లిక్ అయ్యాడు? ఏ ఆటగాడు వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకోలేదా ఓ సారి చూద్దాం.
1. తుషార్ దేశ్ పాండే
చెన్నయ్ సూపర్ కింగ్స్ కు చెందిన ఈ ప్లేయర్ ను.. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన సీజన్ మొదటి మ్యాచ్ లో అంబటి రాయుడు ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దింపింది. అయితే 3.2 ఓవర్లు వేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే జట్టు ఆశించనంతా పెర్ఫామెన్స్ మాత్రం ఇవ్వలేకపోయాడు.
2. సాయి సుదర్శన్
సీఎస్కే తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మేన్ కేన్ విలియమ్సన్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు వచ్చాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సుదర్శన్.. 17 బాల్స్ లో 22 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
3. వెంకటేశ్ అయ్యర్
కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ తరఫును వెంకటేశ్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. వరుణ్ చక్రవర్తి స్థానంలో వచ్చిన అయ్యార్.. 28 బంతులు ఎదుర్కొని 34 రన్స్ చేశాడు.
4. రిషి ధావన్
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రిషి ధావన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫీల్డ్ లోకి వచ్చాడు. స్టార్ బ్యాట్స్ మేన్ రాజపక్స స్థానంలో వచ్చిన రిషి ధావన్.. ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 15 పరుగులు సమర్పించుకున్నాడు.
5. క్రిష్ణప్ప గౌతమ్
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున క్రిష్ణప్ప గౌతమ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ బదోనీ స్థానంలో వచ్చిన గౌతమ్.. ఇంపాక్ట్ ప్లేయర్ విధానానికి పూర్తి న్యాయం చేశాడు. ఆడిన ఒకే బాల్ ను సిక్స్ గా మలిచిన గౌతమ్.. 4-0-23-0తో బౌలింగ్ లోని సత్తా చాటాడు.
6. అమన్ ఖాన్
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అమన్ ఖాన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అమన్ ఖాన్.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్ లో అవుటై వెనుదిరిగాడు.
7. అబ్దుల్ సమాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ గా అబ్దుల్ సమాద్ వచ్చాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫరూకీ స్థానంలో వచ్చిన సమాద్ బాగా ఆడాడు. మొత్తం 32 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ టీమ్ ను గౌరవప్రదమైన స్కోర్ కు తీసుకెళ్లాడు. ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ ఓడిపోయింది.
8. నవదీప్ సైనీ
ఆదివారంలో ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో నవదీప్ సైనీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. యశస్వి జైస్వాల్ ప్లేస్ లో వచ్చిన సైనీ.. 2 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు.
9. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్
సూర్య కుమార్ యాదవ్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ఈ లెఫ్టార్మ్ సీమర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దింపింది. కానీ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చాడు.