DJ టిల్లు పాటకు కోహ్లీ మాస్ డ్యాన్స్.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం (వీడియో)

ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన

Update: 2024-04-26 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై తమను ఓడించిన ఎస్ఆర్‌హెచ్‌పై ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది. హోమ్ గ్రౌండ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను 35 పరుగుల తేడాతో డుప్లెసిస్ సేన చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్‌లో బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉంటే, సన్ రైజర్స్, బెంగళూరు మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత అగ్రెస్సివ్‌గా ఉంటాడో.. అంత ఫన్నీ బీహెవ్ చేస్తాడనే విషయం తెలిసిందే. వికెట్ పడితే బౌలర్ల కంటే ఎక్కువ కోహ్లీ సెలబ్రెషన్స్ చేసుకోవడం ఎన్నోసార్లు చూశాం.

గ్రౌండ్‌లో ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేని కోహ్లీ.. ఆనందాన్ని అయిన కోపాన్ని అయిన వెంటనే ప్రదర్శిస్తాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్టేడియంలో డ్యాన్స్ స్టెప్‌లతో అభిమానుల్లో జోష్ నింపుతాడు. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ మరోసారి తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ బౌండ్రీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియంలో డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ ప్లే కావడంతో బీట్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ కోహ్లీ చేశాడు. కోహ్లీ డ్యాన్స్ చేస్తుండగా గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీజే టిల్లు పాటకు కోహ్లీ స్టెప్‌లు వేయడంతో అభిమానులు గట్టిగా కేరింతలు పెట్టారు. అభిమానుల జోష్‌తో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది.


Similar News