తగ్గేదేలే.. వీరబాదుడే అంటున్న ఆ ఐదుగురు..?
ఐపీఎల్ అంటేనే పరుగుల వరద.. చివరి నిమిషం వరకు గెలుపు ఏ మాత్రం అంచనా వేయలేని రణరంగం.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ అంటేనే పరుగుల వరద.. చివరి నిమిషం వరకు గెలుపు ఏ మాత్రం అంచనా వేయలేని రణరంగం. మరికొద్ది గంటల్లోనే ఐపీల్ సమరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాటర్ల గురించి తెలిసుకుందాం. మ్యాచ్ ఎప్పుడైనా చెలరేగిపోయే అరుదైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. సలీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు బాదింది మనోడు కింగ్ కోహ్లీయే. కోహ్లీ 2008 నుంచి ఐపీఎల్ లో ఒకే జట్టు ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 223 మ్యాచ్ లు ఆడి 6,624 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలున్నాయి. మరో 376 పరుగులు చేస్తే కోహ్లీ7 వేల పరుగుల క్లబ్ లో చేరతాడు.
రెండో స్థానం గబ్బర్ ది.. శిఖర్ ధావన్ మొత్తం 206 మ్యాచ్ లు 6,244 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు చేశాడు. మూడో స్థానంలో కొనసాగుతోంది ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్.. వార్నర్ 2009 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. మొత్తం 167 మ్యాచ్ లు ఆడి 5,881 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అనంతరం ముంబై జట్లకు సారథిగా ఉన్న రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటి వరకు 227 మ్యాచ్ లు ఆడి 879 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.