IPLలో లాస్ట్ బాల్కు సిక్స్ కొట్టి గెలిపించిన ఆటగాళ్లు వీళ్లే..!

ఏ ముహుర్తాన ఐపీఎల్ ను పెట్టారో తెలియదు గానీ.. ఐపీఎల్ వచ్చాక క్రికెట్ స్వభావమే మారిపోయింది.

Update: 2023-04-02 07:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏ ముహుర్తాన ఐపీఎల్ ను మొదలు పెట్టారో తెలియదు గానీ.. ఐపీఎల్ వచ్చాక క్రికెట్ స్వభావమే మారిపోయింది. వన్డే, టెస్ట్ మ్యాచులతో విసుగెత్తిపోయిన ఫ్యాన్స్ కు 20-20 ఫార్మాట్ తో ఐపీఎల్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 20 బంతుల్లో 10 పరుగులు చేయడానికే నానా తంటాలు పడే బ్యాట్స్ మెన్ ఐపీఎల్ 5 బంతల్లోపే 20 పరుగులు చేసే స్థాయికి వెళ్లారు. ఇక ఈ పొట్టి ఫార్మాట్ లో చివరి బంతి వరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని నెలకొంది. ఎందుకంటే చివరి బంతిలో సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన వాళ్లు ఐపీఎల్ చరిత్రలో చాలామందే ఉన్నారు. ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ లో లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి గెలిపించిన ఆటగాళ్లు 11 మంది ఉండగా.. మొత్తం 13 సార్లు ఈ ఫీట్ చోటు చేసుకుంది. ఇక వాళ్లెవరో తెలసుకుందామా..!


1. రోహిత్ శర్మ (2009)

2009లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దక్కన్ చార్జర్స్ తరఫున ఆడాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మోర్తాజా వేసిన లాస్ట్ బంతిలో సిక్స్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు రోహిత్. అదే విధంగా 2011లో ముంబై ఇండియన్స తరఫున ఆడిన హిట్ మ్యాన్.. పూనె వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి బాల్ కు సిక్స్ కొట్టి ముంబై టీమ్ ను గెలిపించాడు. అలాగే 2012 లో దక్కన్ చార్జర్స్ తో జరిగి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలిచి జట్టును గెలిపించాడు.


2. అంబటి రాయుడు (2011)

2011లో ముంబై ఇండియన్స్-కేకేఆర్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ చివరి ఓవర్ లో 21 పరుగులు చేయాల్సిన పరిస్థితి క్రీజులో జేమ్స్ ఫ్రాంక్లిన్, అంబటి రాయుడు ఉన్నారు. అయితే మొదటి 5 బంతులు ఎదుర్కొన్న ఫ్రాంక్లిన్ 16 పరుగులు చేసి చివరి బంతి రాయుడుకు అప్పజెప్పాడు. ముంబై గెలవాలంటే లాస్ట్ బాల్ లో 6 రన్స్ రావాల్సిందే. ఈ టైంలో క్రీజులోకి వచ్చిన రాయుడు లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలిచి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు.


3. సౌరవ్ తివారి (2012)

2012లో పుణె వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీడీ ప్లేయర్ సౌరవ్ తివారి లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. లాస్ట్ బాల్ సిక్స్ తో అంతకు ముందు అదే ఓవర్ లో వరుసగా 4, 6, 6 కొట్టిన డివిలియర్స్ ను పక్కకు పెట్టి ప్రేక్షకులు, మీడియా తివారిని ఆకాశానికెత్తారు.


4.బ్రావో (2012)

వెస్ట్ ఇండీస్ కు చెందిన బ్రావో 2012 సీజన్ లో సీఎఎస్ కే తరఫున ఆడాడు. కేకేఆర్ తో జరిగిన ఓ మ్యాచ్ లో చివరి బంతికి 5 రన్స్ కావాల్సిని పరిస్థితిలో బ్రావో లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలిచి జట్టును గెలిపించాడు.


5. ఎంఎస్ ధోనీ (2016)

మ్యాచ్ ఫినిషర్ గా ధోనీకి ఎంత మంచి పేరుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ పొట్టి ఫార్మాట్ లో 2016లో ధోనీ రైజింగ్ పుణె తరఫున ఆడాడు. కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి 5 బంతుల్లో 22 రన్స్ కావాలి. క్రీజులో ఉన్న ధోనీ.. ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు. ఇక రెండో బాల్ డాట్. 3, 4, 5 బంతుల్లో వరుసగా 4, 6, 6 కొట్టి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు.


6. మిచ్ సాంట్నర్ (2019)

2019లో సీఎస్కే - రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ టీమ్ సెకండ్ బ్యాటింగ్ ను సీఎస్కేకు అప్పజెప్పింది. ఈ క్రమంలోనే చివరి ఓవర్ లో 18 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో క్రీజులో రవీంద్ర జడేజా, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఉన్నారు. టార్గెట్ ఈజీ కాకున్నా ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్ ఉండటంతో సీఎస్కేకు గెలుపుపై ఆశలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా మొదటి బంతికి సిక్స్ కొట్టడంతో 5 బాల్స్ లో 12 పరుగులకు ఈక్వేషన్ మారింది. ఈ క్రమంలోనే తర్వాత బ్యాటింగ్ కు దిగిన ధోనీని స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాంట్నర్.. చివరి 3 బంతులను ఎదుర్కొని.. లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.


7. నికోలస్ పూరమ్ (2020)

ఇక ఈ సీజన్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్, ఆర్సీబీ మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. సెకండ్ బ్యాటింగ్ వచ్చిన కింగ్స్ లెవన్ పంజాబ్ చివరి ఓవర్ లో 2 పరగులు చేయాలి. క్రీజులో విధ్వంసకర బ్యాటర్ గేల్, హార్డ్ హిట్టర్ కేఎల్ రాహుల్ ఉన్నారు. పంజాబ్ విజయం నల్లేరు నడకే అనుకున్నారు అంతా. కానీ మొదటి 4 బంతులు ఎదుర్కొన్న గేల్ ఒక్క రన్ కూడా చేయలేదు. ఇక 5వ బంతికి రనౌట్ అయి వెళ్లిపోయాడు. ఇక ఈ టైంలో క్రీజులోకి వచ్చాడు పూరమ్. చివరి బాల్ కు 2 పరుగులు చేయాలి. అంతా ఊపిరిబిగపట్టి చూస్తున్నారు. కానీ పూరమ్ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి పంజాబ్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు.


8. రవీంద్ర జడేజా (2020)

ఈ సీజన్ లో రవీంద్రా జడేజా సీఎస్కే తరఫున ఆడాడు. కరోనా వల్ల ఈ సీజన్ లో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించలేదు. కాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో సీఎస్కే 10 పరుగులు చేయాలి. అయితే మొదటి మూడు బాల్స్ లో సీఎస్కే 3 పరుగులు మాత్రమే చేసింది. ఇక చివరి 3 బంతుల్లో 7 పరుగులు చేయాలి. ఇక క్రీజులో ఉన్న జడేజా 4వ బంతి డాట్ బాల్ చేశాడు. ఇక చివరి 2 బాల్స్ లో 7 పరుగులు చేయాలి. ఈ క్రమంలో జడేజా చివరి రెండు బాల్స్ ను సిక్సర్లుగా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.


9. శ్రీకర్ భరత్ (2021)

ఈ సీజన్ లో శ్రీకర్ భరత్ ఆర్సీబీతో ఆడాడు. ఇక డీసీతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఆర్సీబీ 15 రన్స్ చేయాలి. ఈ క్రమంలోనే మొదటి 4 బంతులకు 7 పరుగులు చేసింది ఆర్సీబీ. ఇక లాస్ట్ 2 బాల్స్ లో 8 రన్స్ చేయాలి. ఇక 5వ బంతికి డీసీ మిస్ ఫీల్డింగ్ వల్ల 2 రన్స్ వచ్చాయి. ఇక చివరి బంతికి 6 రన్స్ కావాలి. ఈ క్రమంలోనే శ్రీకర్ భరత్ లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలిచి ఆర్సీబీకి తిరుగులేని విజయాన్ని సొంతం చేశాడు.


10. రాహుల్ టెవాటియా (2022)

ఇక గత సీజన్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రాహుల్ టెవాటియా.. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టి జట్టును గెలిపించాడు.


11. రశీద్ ఖాన్ (2022)

లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి విజయాన్ని అందుకున్న జట్టు ఈ సారి కూడా గుజరాత్ టైటాన్సే. అయితే కొట్టింది మాత్రం రశీద్ ఖాన్. ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో రశీద్ ఖాన్ లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.

Tags:    

Similar News