IPL 2023: 'మా ప్లేయర్లను కొట్టారు'.. ప్రేక్షకులపై లెజెండరీ క్రికెటర్ కామెంట్స్..
IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నోబాల్ ఇష్యుపై లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నోబాల్ ఇష్యుపై లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు. హైదరాబాద్ ప్రేక్షకులు నట్లు, బోల్టులు విసిరింది తమ డగౌట్‌పై కాదని, ఆటగాళ్లపై అని రోడ్స్ వెల్లడించాడు. "డగౌట్‌పై కాదు. ప్లేయర్లపై విసిరారు. ప్రేరక్ మన్కడ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తుంటే, అతని తలపై కొట్టారు" అని షాకింగ్ విషయం వెల్లడించాడు. ఇక్కడ జరిగిన ఘటన రోడ్స్‌కు ఏమాత్రం నచ్చలేదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో పెద్ద గొడవ జరిగింది. ఆ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నాలుగో బంతిని అబ్దుల్ సమద్ ఎదుర్కొన్నగా.. ఆ బంతిని బౌలర్ ఫుల్ టాస్ వేశాడు. అది సమద్ నడుము కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చింది. దీంతో అంపైర్లు వెంటనే నోబాల్ ఇచ్చారు. అయితే లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా రివ్యూ కోరగా.. సమద్ పూర్తిగా నిలబడి లేడని భావించిన థర్డ్ అంపైర్.. అది నోబాల్ కాదన్నాడు. ఈ నిర్ణయంపై అందరూ షాకయ్యారు.
అయితే ప్రేక్షకులు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు. లక్నో డగౌట్‌పై తమ ప్రతాపం చూపించారు. కొంతమందేమో 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ.. లక్నో ఆటగాళ్లను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించారు. ఈ బంతి వేసిన తర్వాత కాసేపు ఆటను ఆపేయాల్సి వచ్చింది. లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్టులు విసిరినట్లు తెలిసింది. దీనిపై లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు.
Not at the dugout, but at the players. They hit Prerak Mankad on the head while he was fielding at long on. #noton https://t.co/4yxmuXh7ZF
— Jonty Rhodes (@JontyRhodes8) May 13, 2023