IPL చరిత్రలో SRH మరో సంచలనం.. 10 ఓవర్లలోనే 166 పరుగుల ఛేదన

ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో సంచలన రికార్డు సృష్టించింది.

Update: 2024-05-08 16:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో సంచలన రికార్డు సృష్టించింది. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే చేధించి రికార్డు క్రియేట్ చేసింది. ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలయ్యారు. ఆ తర్వాత నికోలస్ పూర్ (48), ఆయూస్ బదోని(55) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన లక్నో జట్టు.. 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు.. మొదటి నుంచి ఊచకోత కోసింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో సునామీ సృష్టించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లోనే లక్ష్యాన్ని చేధించారు. హెడ్(89), అభిషేక్(75)తో జట్టుకు సునాయాసంగా విజయాన్ని అందించారు.

Tags:    

Similar News