ఐపీఎల్ ఫైనల్ వేళ .. స్విగ్గిలో ‘కండోమ్స్’ ఆర్డర్ల రికార్డు!
2023 IPL ఫైనల్ మ్యాచ్ జియో సినిమాలో 3.2 కోట్ల వీక్షకులతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే మోడీ గ్రౌండ్ లో కూడా దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించారు.
దిశ, వెబ్‌డెస్క్: 2023 IPL ఫైనల్ మ్యాచ్ జియో సినిమాలో 3.2 కోట్ల వీక్షకులతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే మోడీ గ్రౌండ్ లో కూడా దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించారు. మైదానంలో పరిస్థితులు ఇలా.. బయట మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజు రాత్రి స్విగ్గి లో వేల సంఖ్యలో కాండోమ్స్ అర్డర్ అయినట్లు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ స్వయంగా వెల్లడించింది.
సోమవారం రాత్రి 8.30 గంటల వరకే 2,324 కండోమ్స్‌ను తాము డోర్ డెలివరీ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే ఇంకా చాలా డెలివరీలు చేయాల్సి ఉందని స్విగ్గి యాజమాన్యం ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. అందులో ఒకరు ఇలా అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 22 మంది ప్లేయర్లు మాత్రమే.. కానీ బయట ప్లేయర్ల సంఖ్య అంతకంటే ఎక్కువే ఉందిగా అని అన్నాడు. అలాగే మరో నెటిజన్..ఫ్లాట్ పిచ్ పై నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నరేమో అని కామెంట్ చేశారు.
ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో 3,68,353 జిలేబీ పాపడ్ల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గి వెల్లడించింది. ఈ ఆర్డర్లు ఎక్కువగా గోకుల్ ధామ్ నుంచే వచ్చాయని స్పష్టం చేసింది. జిలేబీ పాపడ్‌ను స్నాక్స్‌గా తీసుకోవడానికి గుజరాతీయులు ఇష్టపడతారు.