నేడు పింక్ జెర్సీలో రాజస్థాన్ జట్టు.. ప్రతి సిక్సర్‌కు ఆరు ఇండ్లకు సోలర్ పవర్

ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ఫామ్ లో కొనసాగుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన రాజస్థాన్ జట్టు.. ఒక్కమ్యాచులో కూడా ఓడిపోలేదు.

Update: 2024-04-06 10:37 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ఫామ్ లో కొనసాగుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన రాజస్థాన్ జట్టు.. ఒక్కమ్యాచులో కూడా ఓడిపోలేదు. కాగా ఈ రోజు నాలుగో మ్యాచ్ హోం గ్రౌండ్ అయిన జైపూర్‌లో ఆర్సీబీతో రాజస్థాన్ మ్యాచు జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు పూర్తిగా పింక్ కలర్ జెర్సీలో దర్శనమివ్వనుంది. దీనికి సంబంధించిన కొత్త జెర్సీని కూడా కెప్టెన్ సంజూ శాంసన్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మూడు మ్యాచుల్లో వరుస విజయాలను అందించిన జెర్సీని కాదని కొత్త జెర్సీని ఎందుకు దరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి.

కాగా సొంత గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను RR జట్టు రాజస్థాన్ మహిళలకు అంకితం చేసింది. ఈ మ్యాచ్ కోసం RR ప్రత్యేక ఆల్-పింక్ జెర్సీని కూడా ధరించడానికి సిద్ధంగా ఉంది. "ఏప్రిల్ 6న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2024 మ్యాచ్‌లో, రాయల్స్ వారి #PinkPromiseలో భాగంగా ప్రత్యేక ఆల్-పింక్ మ్యాచ్‌డే కిట్‌లను ధరిస్తారు, దీని ద్వారా సాధికారత పొందిన మహిళలకు వారి మద్దతును విస్తరించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాలు గణనీయమైన సామాజిక పరివర్తనను కలిగి ఉన్నాయి" అని ఫ్రాంచైజీ తన అధికారిక హ్యాండిల్‌లో ఒక ప్రకటనలో ప్రకటించింది.

అలాగే ఈ మ్యాచ్ సంబంధించి అమ్ముడుపోయిన ప్రతి టికెట్ పై 100 రూపాయలను రాజస్థాన్ లోని మహిళల కోసం ఉపయోగించడానికి..రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు అందిస్తారు. అంతేకాకుండా, రెండు జట్లు మ్యాచ్ సమయంలో బ్యాటర్లు కొట్టిన ప్రతి సిక్సర్ పై రాజస్థాన్ రాయల్స్, రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్ సంభార్ ప్రాంతంలోని 6 ఇళ్లకు సౌర శక్తి(సోలార్ పవర్)ను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్‌లో చెప్పుకొచ్చింది.


Similar News