IPL 2023: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్‌పై చెన్నై హెడ్‌కోచ్ క్లారిటీ
IPL 2023 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అని ఆ తర్వాత తప్పుకుంటాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అని ఆ తర్వాత తప్పుకుంటాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్ ముగిశాక చెన్నై హెడ్‌కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. పంజాబ్‌తో మ్యాచ్ ముగిశాక ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్ గురించి ఏమైన చెప్పారా అని రిపోర్టర్స్ ఫ్లేమింగ్‌ను అడగగా.. ‘అతడు మాకు అలాంటి సమాచారమేమీ చెప్పలేదు. అది బయట జరుగుతున్న చర్చనే..’ అని క్లారిటి ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు. అయితే ఈ సీజన్‌లో చెన్నై 9 మ్యాచ్‌లు ఆడగా.. ఐదింటిలో గెలిచి నాలుగు ఓడింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ రేసులో పోటీ పడుతోంది.
Read more: