ఐపీఎల్‌లో బిగ్ ట్విస్ట్.. కెప్టెన్‌ను మార్చిన లక్నో సూపర్ జెైయింట్స్
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు 11వ మ్యాచ్ లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. లక్నోలోని వాజ్పేయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు 11వ మ్యాచ్ లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. లక్నోలోని వాజ్పేయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేఎల్ రాహుల్ ను తప్పించి యాజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ అయిన నికోలస్ పూరన్ ను కెప్టెన్ గా ప్రకటించడమే కాకుండా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా LSG నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా రాహుల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. జట్టు కెప్టెన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవడం ఎంటని ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు లక్నో ఫ్యాన్స్. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్ కు కొద్ది రోజుల పాటు రెస్ట్ అవసరం ఉంది. ఈ క్రమంలో అతనికి కొద్ది మ్యాచులకు రెస్ట్ ఇవ్వాలనుకున్నప్పటికి రాహుల్ మ్యాచులో ఉండాల్సిందే అని పట్టుబట్టాడు. దీంతో అతన్ని కేవలం బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం చేయాలని యాజమాన్యం భావించినట్లు పూరన్ తెలిపారు.
లక్నో సూపర్ జెయింట్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్(w), KL రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్(c), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(సి), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(w), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్