దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో లీగ్‌లో 14 మ్యాచ్‌లో 10 గెలిచిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది. నేటి నుండి ప్లే ఆఫ్స్ మ్యాచులకు తెరలేవనుంది. ఇందులో భాగంగా ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. ఫామ్ పరంగా రెండు జట్లు బలంగా కన్పించడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచులో గెలిచిన టీంతో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచులోనే గెలిచి ఫైనల్ టికెట్ కొట్టేయాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా మ్యాచు జరగనుంది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను అడ్డుకోవడం చెన్నైకి సవాల్‌గా మారనుంది. వరుస మ్యాచుల్లో సెంచరీలు బాదిన గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గుజరాత్‌కు మంచి ఆరంభం అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఆర్సీబీపై గుజరాత్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తొలి క్వాలిఫైయర్‌లో తాము గెలుస్తామని శుభ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ చెపాక్ పిచ్‌కు సరిగ్గా సరిపోయే బౌలింగ్ ఎటాక్ తమ వద్ద ఉందని గిల్ చెప్తున్నాడు. కాబట్టి తాము క్వాలిఫైయర్-1 గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్ చేరతామని అన్నాడు. "ఈ మ్యాచ్ కచ్చితంగా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. అయతే ఈ వికెట్‌కు సరిగ్గా సరిపోయే బౌలింగ్ మా దగ్గర ఉంది. కాబట్టి వరుసగా రెండోసారి కూడా మేం ఫైనల్ చేరుకుంటామని ఆశిస్తున్నా" అని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.