IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. క్యాన్సర్‌పై అవగాహనలో భాగంగా గుజరాత్ టీమ్ ఈ రోజు లావెండర్ కలర్ జెర్సీతో బరిలోకి దిగితోంది. 7 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న సన్‌రైజర్స్ ఈ నామమాత్రపు పోరులో విజయం సాధించి తమ అభిమానులను అలరించాలనుకుంటోంది. మరోవైపు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. సన్‌రైజర్స్‌ను ఓడించి క్వాలిఫయర్-1కు అర్హత సాధించాలనుకుంటోంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (డబ్ల్యు), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, టి నటరాజన్