IPL 2023: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
IPL 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టుకు ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్. గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలుంటాయి. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నామమాత్రపు మ్యాచ్. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆ జట్టు తమతో పాటు ఆర్‌సీబీని తీసుకెళ్లాలనుకుంటోంది. గత మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. నెట్ రన్ రేట్‌ను -0.344 నుచి 0.166గా మార్చుకుంది.
రాజస్థాన్‌ను వెనక్కునెట్టి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. అదే జోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు బౌండరీ చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు పండుగ చేసుకోనున్నారు. ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్‌ను ఉంచితే హైదరాబాద్‌ను ఓడించవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఇక్కడ ఎక్కువ విజయాలు సాధించాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (w), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (w), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్
A look at the Playing XI for #SRHvRCB
— IndianPremierLeague (@IPL) May 18, 2023
Live - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/EMyXzfHubV