IPL 2023: నేడు డబుల్ ధమాకా.. ఢిల్లీతో ఆర్సీబీ.. లక్నోతో పంజాబ్ కింగ్స్‌‌ ఢీ

IPL 202లో భాగంగా బెంగళూరు ఎంఏ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టబోతున్నది.

Update: 2023-04-14 18:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 202లో భాగంగా నేడు డబుల్ ధమాకా.. రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ బెంగళూరు ఎంఏ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టబోతున్నది. ఈ సీజన్‌లో ఆర్సీబీ తలరాత పెద్దగా మారలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ- ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. ఆ తరువాతి రెండు మ్యాచ్‌లల్లో కోల్‌కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకమైన గేమ్. తన పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయడానికి ఆర్సీబీ, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టాలని ఢిల్లీ కేపిటల్స్ పట్టుదలతో ఉన్నాయి. ఏ జట్టు ఓడినా- మున్ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు.

అలాగే శనివారం జరిగే రెండో మ్యాచ్‌లో.. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయంట్స్ ధావన్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సూజర్ జెయంట్స్ జట్టు ఇక అగ్రస్థానంపై గురి పెట్టింది. ఈ ఏడాది టోర్నీలో ఉత్తమ జట్లలో ఒకటిగా సూపర్ జెయంట్స్ కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింటిలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఈ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మరోవైపు పంజాబ్ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఈ టోర్నీని ప్రారంభించింది. కానీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

అయితే మరోసారి గెలుపు బాటలో నడవాలని శిఖర్ ధావన్ సేన భావిస్తోంది. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే లక్నో జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. అంతేకాకుండా మున్ముందు మరింత కఠినమైన మ్యాచ్‌లు ఎదురుకానున్నాయి. పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే లక్పో పిచ్ గత మ్యాచ్‌లో కొంత స్పిన్నర్లకు సహకరించింది. దీంతో భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. ఇక వాతావరణం విషయానికొస్తే శనివారం 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కానుంది. వర్షం వచ్చే అవకాశమే లేదు. ఈ పిచ్‌పై చేజింగ్ చేయడం కష్టమే. కనుక టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిది. వీటన్నిటిని బట్టి చూస్తే లక్నో జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్లో పిచ్‌పై కూడా సత్తా చాటగల ఆటగాళ్లు ఆ జట్టులో ఎక్కువగా ఉన్నారు.

Tags:    

Similar News