దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నది.
హెడ్ టు మ్యాచ్‌ల్లో ఎవరిది పైచేయి..?
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 27 మ్యాచ్‌లు జరిగగా.. ఇందులో చెన్నై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ ఇప్పటికే జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
పిచ్ రిపోర్టు.. ఎవరికి అనుకూలం..
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పిచ్ బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్ స్కోర్ సులభంగా పరుగులు చేస్తారు. అయితే బౌలర్లు మంచి లైన్, లెంగ్త్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగులు చేయాలంటే వికెట్‌పైనే సమయం గడపాల్సి ఉంటుంది. అలాగే ఈ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది.
The Playing XIs are IN!
— IndianPremierLeague (@IPL) April 27, 2023
What are your thoughts on the two sides today?
Follow the match ▶️ https://t.co/wKHNy124q1 #TATAIPL | #RRvCSK pic.twitter.com/JJpMv7uYvg