IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియాన్స్..
IPL 2023లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం లక్నోకు బలమే అయినా అదే బలహీనత అని కూడా చెప్పక తప్పదు. ఇక్కడ ఆరు మ్యాచ్‌లు ఆడిన లక్నో రెండింట మాత్రమే గెలిచింది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ చేతిలో ఓడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓడిన మూడు మ్యాచ్‌లలో లక్నో ఛేదన చేసే క్రమంలో తడబాటుకు గురై విజయం ముంగిట బోల్తా కొట్టింది.
ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే టాప్ -2కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నైకి 15, ముంబైకి 14 పాయింట్లున్నాయి. ఇక లక్నో గెలిస్తే.. ముంబైని వెనక్కినెట్టి టాప్ -3కి వెళ్లడమే గాక ప్లేఆఫ్స్ బెర్త్‌ను మరింత ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ లక్నో ఓడితే మాత్రం ఆ జట్టుకు ఆర్సీబీ, రాజస్తాన్‌తో నాలుగో స్థానానికి పోటీ తప్పకపోవచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్(w), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(సి), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్
The Playing XIs are IN ‼️
— IndianPremierLeague (@IPL) May 16, 2023
What do you make of the two sides?
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/9P4rCMqg5B