IPL 2023: టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్‌..

IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Update: 2023-04-11 13:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌ హిస్టరీ చూసుకుంటే.. దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్‌దే స్వల్ప ఆధిపత్యం. ఇప్పటి వరకు ఇరు జట్లు 32 సార్లు తలపడ్డాయి. 17-15తో రోహిత్‌ సేనదే అప్పర్‌ హ్యాండ్. రీసెంట్ ఫామ్‌ చూసుకుంటే మాత్రం ఢిల్లీ దూకుడుగా ఉంది. 2020 నుంచి ఐదు సార్లు తలపడగా మూడుసార్లు ఢిల్లీ గెలిచింది. ఈ ఐదింట్లోనూ ఛేదన జట్టే గెలిచింది.

ఛేజింగ్ టీమ్‌దే గెలుపు..!

దేశంలోని పురాతన స్టేడియాల్లో అరుణ్‌ జైట్లీ స్టేడియం ఒకటి. ఇప్పటికే ఈ మైదానంలో కొన్ని వందల మ్యాచులు జరిగగా.. ఈ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. అయితే బ్యాటర్లు నిలబడితే రన్స్ చేయగలరు. 2019 నుంచి ఇక్కడ 31 టీ20లు జరగగా.. ఛేదన జట్లే 23 సార్లు గెలిచాయి. ఆరుసార్లే టార్గెట్‌ డిఫెండ్‌ చేసుకోగలిగారు. రెండు సార్లు టై అయింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన చివరి మ్యాచులో పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకూ సహకరించింది. కాబట్టి జైట్లీ పిచ్‌లో ముంబయి, ఢిల్లీలో ఎవరిది పైచేయో ఇప్పుడే చెప్పలేం.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (సి), మనీష్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (w), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, రిలే మెరెడిత్

Tags:    

Similar News