IPL 2023: ముంబై ఇండియన్స్ అరుదైన ఘనత.. తొలి జట్టుగా..

IPL 2023 సీజన్‌లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 182 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Update: 2023-05-25 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకుండా భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డును అధిగమించింది. 2018 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ముంబై ఇండియన్స్ ఈ ఘనతను అందుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఇలా జరగడం చాలా అరుదు.

లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 26), ఇంపాక్ట్ ప్లేయర్ నెహాల్ వధేరా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) మెరుపులు మెరిపించారు. అనంతరం ఆకాశ్‌ మధ్వాల్‌ (3.3-0-5-5) ధాటికి లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్‌ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్‌కు రేపు (మే 26) జరుగబోయే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్‌‌తో తలపడనుంది.

Tags:    

Similar News