IPL 2023: ప్రభు సిమ్రాన్ హాఫ్ సెంచరీ.. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. ప్రభు సిమ్రాన్ 28 బంతుల్లో (50) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇందులో 7 ఫోర్స్, 2 సిక్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం 7.4 ఓవర్లలో 75 పరుగులు చేసింది. ప్రభు సిమ్రాన్(50), శిఖర్ ధవన్ (16) క్రీజులో ఉన్నారు.