IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్.. పాండ్యా షాకింగ్ డెసిషన్!
ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో తొలుత బౌలింగ్ చేయనుంది. అయితే, ఐపీఎల్లో ఎక్కువ జట్లు టాస్ గెలిస్తే ఛేజింగ్‌కే మొగ్గు చూపుతుండగా.. పాండ్యా మాత్రం అనూహ్యంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, ఇరు జట్ల స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో బలంగా కనిపిస్తున్నాయి. కాగా, మరి కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్ల వివరాలు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ