దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. మరో వైపు మొదటి మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడింది. విరాట్ కోహ్లీ మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు.
అయితే గత ఐదు మ్యాచుల్లో హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచుల్లో టీమ్స్ ఓడిపోవడం, ఆర్‌సీబీని కలవరబెట్టే విషయం. వానిందు హసరంగ నేటి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఆర్‌సీబీ బౌలింగ్ యూనిట్‌కి కాస్త పాజిటివ్ విషయం. నేటి మ్యాచ్ ద్వారా విజయ్ కుమార్ వైషక్, ఆర్‌సీబీ టీమ్ నుంచి ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తున్నాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ మార్పుతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతోంది. పెళ్లి కోసం వారం రోజులు లీవ్ తీసుకుని స్వదేశానికి వెళ్లిన మిచెల్ మార్ష్ తిరిగి వచ్చి టీమ్‌తో కలిశాడు. దీంతో రోవ్‌మన్ పావెల్, రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, యష్ ధుల్, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హాకీం ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఆన్రీచ్ నోకియా, ముస్తాఫిజుర్ రహ్మాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లిసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైషక్
The Playing XIs are in ✅
— IndianPremierLeague (@IPL) April 15, 2023
What do you make of the two sides in the #RCBvDC contest?
Follow the match ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL pic.twitter.com/sXRSsVvSYw