IPL 2023 CSK vs GT: ధోని ఆ బౌలర్ని ఎంచుకోవడం వల్లే చెన్నై సూపర్ కింగ్స్ విఫలమయ్యిందా?
శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమయ్యిన విషయం మనందరికీ తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమయ్యిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ లీగ్లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే 120 బాల్స్‌కు 7 వికెట్ల నష్టంతో 178 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్( 50 బాల్స్‌కు 92 పరుగులు) అదిరిపోయే ఆటను ప్రదర్శించాడు. మొయిన్ అలీ (23 పరుగులు ) ఫర్వాలేదనిపించాడు. అందరూ విఫలమైన తర్వాత ధోని వంతు వచ్చింది 7 బాల్స్‌కు 14 పరుగులు చేసి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమీలకు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 182 పరుగులు చేసి బోణి కొట్టేసింది. శుబ్‌మన్ గిల్ (36 బాల్స్ కు 63 పరుగులు చేసి మ్యాచ్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. దేశ్ పాండే బౌలింగ్ కరెక్టుగా వేసి ఉంటె గిల్ వికెట్ దొరికేది. ఇక్కడ ధోని లెక్క తప్పిందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.