IPL 2023: మరో ఆసక్తికర పోరు.. నేడు సన్‌రైజర్స్‌తో ఢిల్లీ ఢీ

IPL 2023లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టబోతున్నాయి.

Update: 2023-04-23 18:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టబోతున్నాయి. రెండు వరుస పరాజయాలతో చతికిలపడిన సన్‌రైజర్స్.. తమ కంటే బలహీనంగా ఉన్న ఢిల్లీపై గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టాలని మార్క్‌రమ్ సేన భావిస్తోంది. మరోవైపు వరుసగా 5 ఓటముల తర్వాత ఒక మ్యాచ్‌లో విజయాన్నందుకున్న ఢిల్లీ అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌కు ఉప్పల్ వేదికకానుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు‌ను బ్యాటింగ్ వైఫల్యం వేధిస్తోంది. హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగినా.. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు హెన్రీచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్‌ కూడా విఫలమవుతుండటం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మాయంక్ మార్కండే రాణిస్తుండగా ఇతర బౌలర్లు విఫలమవుతున్నారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ప్రభావం చూపడం లేదు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్.. బ్యాటింగ్ లైనప్‌లో వార్నర్ ఒక్కడే రాణిస్తుండగా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో అతను కూడా నిదానంగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా టాపార్డర్‌ చేతులెత్తేయడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నది. ఓపెనర్ పృథ్వీషా దారుణంగా నిరాశపరుస్తుండటంతో జట్టుకు శుభారంభం కరువైంది. మనీశ్ పాండే, మిచెల్ మార్ష్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, రోమన్ పొవెల్, రిలీ రొసోవ్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పొరెల్.. ఇలా మిడిలార్డర్‌లో బ్యాటర్లను మారుస్తున్నా ప్రయోజనం మాత్రం లేదు.

వార్నర్ తర్వాత అక్షర్ పటేల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వార్నర్, అక్షర్‌కు తోడు మిగతా బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తేనే ఈ సీజన్‌లో ఢిల్లీ భవితవ్యం ఆధారపడి ఉన్నది. బౌలింగ్ విభాగంలో.. నోర్జే, ముస్తాఫిజుర్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నా.. వారిని సరిగా వినియోగించుకోలేకపోవడం కూడా జట్టుకు నష్టాన్ని చేకూరుస్తున్నది. ఇప్పటికైనా ఢిల్లీ జట్టు లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్ (WK), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా):

డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

Tags:    

Similar News