2023 IPL final: ఇవాళ కూడా వర్షం పడితే విన్నర్‌ను డిసైడ్ చేసేది ఇలాగే!
భారీ వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో రిజర్వ్ డే ఆయిన మే 29 సోమవారానికి మ్యాచ్‌ను పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో రిజర్వ్ డే ఆయిన మే 29 సోమవారానికి మ్యాచ్‌ను పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. సోమవారం కూడా అహ్మదాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రిజర్వ్ డే అయిన సోమవారం అయిన మ్యాచ్ ప్రారంభం అయ్యేన అని ఐపీఎల్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా పూర్తిగా వర్షం పడితే ఏం జరుగుతుంది. ఐపీఎల్ విన్నర్ ను ఎలా ప్రకటిస్తారు అనే అనుమానం ప్రేక్షకుల్లో మొదలైంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వర్షం పడితే చివరి నిమిషం వరకు వేచి చూస్తారు. టాస్ పడిన తర్వాత వర్షం పడితే.. కనీసం రెండు జట్లకు ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. అసలు టాస్ పడకుండా.. 11 గంటలు దాటితే.. సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే చిట్టచివరకు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్‌లో గుజరాత్ జట్టును ఐపీఎల్ 2023 విన్నర్ గా ప్రకటించనున్నారు. ఇలా జరిగితే మాత్రం చెన్నై అభిమానులకు భారీ షాక్ తప్పదు. మరీ ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
Read more:
IPL FINAL 2023: నిన్న టికెట్ తీసుకున్న అభిమానులకు గుడ్ న్యూస్