IPL 2023 : చెన్నై- గుజరాత్ మధ్య తొలి మ్యాచ్.. గుజరాత్‌పై ఒక్కసారి కూడా నెగ్గని సీఎస్‌కే.. ధోనీకి పరాభవం తప్పదా..?
ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య నేడు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య నేడు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఈసారి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో తలపడేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందని రెండు జట్ల ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. కానీ, హిస్టరీ చూసుకుంటే ఈ మ్యాచ్‌లో విజయం గుజరాత్‌నే వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చివరగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచులన్నింట్లో విజయం గుజరాత్‌దే.
గతేడాది తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎవరూ ఊహించని విధంగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గుజరాత్ రెండుసార్లు తలపడింది. ఈ రెండు మ్యాచుల్లోనూ గుజరాత్ జయభేరి మోగించింది. దీంతో ఈ సీజన్‌లో కూడా తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే చెన్నై ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా తమ జట్టు టోర్నీని విజయంతో మొదలు పెడుతుందని ధీమాగా ఉన్నారు. మరి ఈ అంచనాలను అందుకుని.. గత ఏడాది పరాభవాలకు చెన్నై జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా..? లేక ధోనీ సారథ్యంలో కూడా ఈ జట్టుకు మరో పరాజయం తప్పదా..? అనేది ఆసక్తిగా మారింది.
గుజరాత్ టైటాన్స్ (GT) IPL 2023 జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, కోన భరత్ (వికెట్), వృద్ధిమాన్ సాహా (వికె), కేన్ విలియమ్సన్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మహమ్మద్ షమీ, ప్రదీప్ సాంగ్వాన్, ఆర్ సాయి కిషోర్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, శివమ్ మావి, మాథ్యూ వేడ్, ఒడియన్ స్మిత్, ఉర్విల్ పటేల్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్ (మొదటి 2 గేమ్‌లలో అందుబాటులో లేదు), జోష్ లిటిల్ (మొదటి మ్యాచ్ అందుబాటులో లేదు), యష్ దయాల్, జయంత్ యాదవ్, ఒడియన్ స్మిత్, నూర్ అహ్మద్, అల్జారీ జోసెఫ్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) IPL 2023 జట్టు:
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, సిసంద మగల, రవీంద్ర జడేజా, శివం దుబే, డ్వైన్ ప్రిటోరియస్, అహయ్ మండల్, నిశాంత్ సింద్ హంగర్, రాజవర్హన్ సింద్ హంగర్ , మిచెల్ సాంట్నర్, సుభర్న్షు సేనాపతి, సిమర్‌జీత్ సింగ్, మతీసా పతిరన, మహేష్ తీక్షణ, భగత్ వర్మ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, తుషార్ దేశ్‌పాండే.